పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలి

Jan 23 2026 6:35 AM | Updated on Jan 23 2026 6:35 AM

పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలి

పన్ను వసూళ్లలో లక్ష్యాన్ని సాధించాలి

● రామగుండం నగరపాలక కమిషనర్‌ అరుణశ్రీ

కోల్‌సిటీ(రామగుండం): ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్నందున ఆస్తిపన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యాన్ని సాధించాలని రామగుండం నగరపాలక కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. గురువారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భారీ బకాయిలు ఉన్న వ్యక్తులు, సంస్థలపై మొదటగా దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల డేటా క్షేత్రస్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా, లైటింగ్‌, ర్యాంప్‌ తదితర వసతులు కల్పించాలని సూచించారు. అలాగే జిల్లా పద్మశాలీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను కమిషనర్‌తో పాటు అధ్యక్షుడు కొలిపాక సారయ్య, పెద్దపల్లి ఆర్డీవో, టీపీయూఎస్‌ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు బొద్దుల గంగయ్య ఆవిష్కరించారు. ఎస్‌ఈ గురువీర, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement