‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది | - | Sakshi
Sakshi News home page

‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది

Aug 29 2025 6:53 AM | Updated on Aug 29 2025 6:53 AM

‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది

‘ప్రత్యామ్నాయ’మే పనికొచ్చింది

కామారెడ్డి రైల్వే ట్రాక్‌ రిపేర్‌తో పలు రైళ్ల డైవర్షన్‌ ఆదుకున్న పెద్దపల్లి–నిజామాబాద్‌ మార్గం నిజామాబాద్‌ వైపు వెళ్లే రైళ్లను బైపాస్‌ మీదుగా మళ్లింపు లోకో రివర్స్‌ అవసరం లేకుండా సమయం ఆదా నేడు ఉమ్మడి జిల్లాలో పలు రైళ్లు పాక్షికంగా రద్దు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

భారీ వర్షాల నేపథ్యంలో.. కామారెడ్డిలో రైల్వేట్రాక్‌ కొట్టుకుపోయిన క్రమంలో ప్రత్యామ్నాయంగా వేసిన పెద్దపల్లి – నిజామాబాద్‌ రైల్వేమార్గమే కీలకంగా మారింది. కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను అధికారులు ఈ మార్గం మీదుగా మళ్లించారు. గతేడాది నవంబర్‌లో పెద్దపల్లి సమీపంలోని రాఘవాపూర్‌ వద్ద రైలు పట్టాలు తప్పిన సమయంలోనూ పెద్దపల్లి– నిజామాబాద్‌ రైల్వేమార్గం కీలకంగా మారింది. తాజాగా కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ ప్రత్యామ్నాయ మార్గం తన ప్రాధాన్యాన్ని చాటుకుంది. ఈసారి బైపాస్‌ మార్గం కూడా పూర్తవడంతో ప్రతీ రైలుకు దాదాపు 30 నుంచి 40 నిమిషాలపాటు లోకో రివర్స్‌కు సమయం మిగలడం గమనార్హం.

పెద్దపల్లి వెళ్లకుండా బైపాస్‌ మీదుగానే..

గతంలో బల్లార్షా–కాజీపేట మార్గం నుంచి పెద్దపల్లి–నిజామాబాద్‌ మార్గంలో మళ్లించాల్సి వస్తే.. ప్రతీ రైలు ముందుగా పెద్దపల్లి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ రైలు ఇంజిన్‌ రివర్స్‌ తీసుకోవాలి. తిరిగి పెద్దపల్లి–నిజామాబాద్‌ వైపు సిద్ధమైన తరువాత సిగ్నల్‌ దొరకాలంటే కనీసం 40 నిమిషాలుపట్టేది. ఇటీవల పె ద్దపల్లి బైపాస్‌ అందుబాటులోకొచ్చాక.. నేరుగా బై పాస్‌ మీదుగా పెద్దపల్లి – నిజామాబాద్‌ సెక్షన్‌లోకి సులువుగా రైళ్లు మళ్లుతున్నాయి. ఫలితంగా లోకో రివర్స్‌ తీసుకునే అవసరం లేకుండా.. ప్రతీసారి 40 నిమిషాల సమయం ఆదా అవుతోంది.

మళ్లించిన రైళ్లు ఇవే..

కాజీపేట నుంచి బల్లార్షా, పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌ రైల్వేమార్గాల్లో నడిచే మెమూ, పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రైల్వే అధికారులు పాక్షికంగా రద్దు చేశారు. పెద్దపల్లి–నిజామాబాద్‌ సెక్షన్‌ మీదుగా పలు రైళ్లను మళ్లించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ భారం పడింది. ఫలితంగా అధికారులు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వాస్తవానికి బల్లార్షా–కాజీపేట, పెద్దపల్లి–నిజామాబాద్‌ సెక్షన్లలో వర్షాలు, ప్రతికూల పరిస్థితులు లేకపోయినా.. ఈ ప్రాంతంవాసులు మాత్రం రైలు ప్రయాణానికి దూరం కావాల్సి వచ్చింది. గతేడాది నవంబరులో రాఘవాపూర్‌ వద్ద రైలు పట్టాలు తప్పినపుడు ఇదేవిధంగా ఇక్కడి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

● రైలు నంబర్‌ 17033/17034 భద్రాచలం–బల్హర్షా– సిర్పూర్‌ టౌన్‌–భద్రాచలం సింగరేణి మెమూ ఎక్స్‌ప్రెస్‌ రైలు 29న భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్‌ మధ్య మాత్రమే నడుస్తుంది. ఈ రైలు కాజీపేట– బల్హర్షా/సిర్పూర్‌ టౌన్‌–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దయ్యింది.

● 17035 కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ గురు, శుక్రవారం కాజీపేట నుంచి బయలుదేరేది పూర్తిగా రద్దయ్యింది. బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే 17036 ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్ర, శనివారాలు రద్దయ్యింది.

● 67771/72 , 67773/74 కరీంనగర్‌ నుంచి సిర్పూర్‌ టౌన్‌ – కరీంనగర్‌, కరీంనగర్‌ – బోధన్‌ – కరీంనగర్‌ పుష్‌పుల్‌ మెమూ ప్యాసింజర్‌ శుక్రవారం ఇరువైపులా రద్దు చేశారు.

● కాగజ్‌నగర్‌ వైపు శుక్రవారం నడిచే 17233 భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట మధ్యనే నడుస్తుంది. ఇదే ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ వైపు 17234 కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ మధ్య మాత్రమే నడుస్తుంది.

● శుక్రవారం ఎగువ మార్గంలో నడిచే చైన్నె సెంట్రల్‌ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా 16031 వెళ్లే అండమాన్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌.. దిగువ మార్గంలో నడిచే 16032 శ్రీమాతా వైష్ణోదేవి కాట్రా నుంచి చైన్నె సెంట్రల్‌ అండమాన్‌ ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement