
నీట మునిగిన పంటలు
జ్యోతినగర్/సుల్తానాబాద్/జూలపల్లి: భారీ వర్షాలకు జిల్లాలో వాగులువంకలు పొంగిపొర్లాయి. చెరువులకు జలకల సంతరించుకుంది. రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్ శివారుకు గోదావరి బ్యాక్‌వాటర్ వచ్చి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న భారీ వరదతో మల్కాపూర్ శివారులో 50 ఎకరాలకు పైగా పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. బ్యాక్‌వాటర్ వచ్చిన ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ అరుణశ్రీ, తహసీల్దార్ ఈశ్వర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి తీరం వెళ్లరాదని సూచించారు. జూలపల్లి మండలంలో పత్తి చేలలో నీరు నిలిచింది. హుస్సేన్‌మియావాగుకు వరద పోటెత్తడంతో వడ్కాపూర్– ధూళికట్ట మధ్య రాకపోకలు నిలిచాయి.

నీట మునిగిన పంటలు