
వర్షంలోనూ యూరియా పాట్లు
ఎలిగేడు/ఓదెల: ఎలిగేడు మండలకేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం గోదాం వద్ద గురువారం ఉదయం రైతులు వర్షాన్ని లెక్క చేయకుండా యూరియా కోసం బారులు తీరారు. సంఘం ఆధ్వర్యంలో 680 యూరియా బస్తాలను 245మంది రైతులు పంపిణీ చేశామని ఏవో ఉమాపతి తెలిపారు. అలాగే ఓదెల మండలం పొత్కపల్లి సొసైటీ ఎదుట సుమారు 200 మంది రైతులు యూరియా కోసం వర్షాన్ని లెక్కచేయకుండా పడిగాపులు కాచారు. ఆధార్‌కార్డుకు ఒకటి చొప్పున పంపిణీ చేసి స్టాకు లేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగారు. కాగా గోదాం వద్ద తొక్కిసలాట జరగడంతో ఎస్సై రమేశ్ ఘటన స్థలాన్ని సందర్శించారు. సిబ్బంది సాయంతో యూరియా పంపిణీ చేశారు.

వర్షంలోనూ యూరియా పాట్లు