
విఘ్నరాయ శరణు శరణు
పెద్దపల్లిరూరల్/గోదావరిఖని/జ్యోతినగర్: జిల్లాలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి అదనపు కలెక్టర్ వేణు దంపతులు పూజలు చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ అంబర్‌కిషోర్‌ఝా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్‌షిప్‌లోని మండపంలో కొలువుదీరిన వినాయకుడికి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక పూజలు చేశారు.
పూజలు చేస్తున్న ఎన్టీపీసీ ఈడీ
చందన్ కుమార్ సామంత
పోలీస్ కమిషనరేట్‌లో
సీపీ అంబర్‌కిషోర్‌ఝా, అధికారులు

విఘ్నరాయ శరణు శరణు

విఘ్నరాయ శరణు శరణు