మట్టి గణపతులను పూజిద్దాం | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతులను పూజిద్దాం

Aug 26 2025 8:38 AM | Updated on Aug 26 2025 8:38 AM

మట్టి

మట్టి గణపతులను పూజిద్దాం

పెద్దపల్లిరూరల్‌: జిల్లావాసులు తమ ఇళ్లలో మ ట్టి గణపతులనే పూజిస్తూ, పర్యావరణ పరిరక్ష ణకు సహకరించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అ న్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మట్టి వినా యకులనే పూజించాలంటూ అవగాహన క ల్పించేలా ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సహజసిద్ధంగా లభించే మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే పూజించేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. కా ర్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రంగారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ భిక్షపతి, సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

గోదావరిఖని: గణేశ్‌ మండప నిర్వాహకులు ని బంధనల మేరకు వ్యవహరించాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ సూచించారు. స్థానిక రాజ్య లక్ష్మి ఫంక్షన్‌హాల్‌లో సోమవారం గణేశ్‌ మండ ప నిర్వాహకులకు అవగాహన కల్పించారు. వి నాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసు, విద్యు త్‌ శాఖల అనుమతి తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లు వాడొద్దని, ఇతర మతాలు, వ్యక్తులను కించపర్చేలా ప్రసంగా లు, పాటలు ఉండొద్దని, అనుమానాస్పద వ్య క్తుల గురించి పోలీస్‌లకు సమాచారం ఇవ్వా ల ని అన్నారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరా వు, ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు సంధ్యారాణి, ర మేశ్‌, భూమేశ్‌, అనూష పాల్గొన్నారు.

లోకోపైలెట్ల నిరసన

రామగుండం: తమ డిమాండ్లను పరిష్కరించా లని కోరుతూ స్థానిక రైల్వేస్టేషన్‌లో లోకోపైలె ట్లు సోమవారం నిరసన తెలిపారు. అసోసియే షన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, అసిస్టెంట్‌ లో కోపైలెట్‌(ఏఎల్‌పీ)ఖాళీలు భర్తీ చేయాలని, రి టైర్డ్‌ రన్నింగ్‌ స్టాఫ్‌ను కాంట్రాక్టు బేసిక్‌పై వి ధు ల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. ప్రతినిధు లు సీహెచ్‌ రవి, సచిన్‌, మిథిలేశ్‌, లక్ష్మణ్‌, వి నయ్‌, శ్యామ్‌, సూరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

బోనస్‌ చెల్లించాలని వినతి

స్థానిక రైల్వే ఆర్‌వోహెచ్‌ షెడ్‌ కాంట్రాక్టు కార్మి కులకు జాతీయ సెలవులు (ఎన్‌హెచ్‌), అలవెన్సులు, దసరా బోనస్‌ చెల్లించాలని రైల్వే సీ అండ్‌ డబ్ల్యూ, డిపో సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ పాండునాయక్‌కు దక్షిణ మధ్య రైల్వే మల్టిపుల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కన్నూరి సతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వినతిప త్రం అందజేశారు. నాయకులు సీహెచ్‌ కుమా రస్వామి, ఆసిఫ్‌, రజనీకాంత్‌, ప్రసాద్‌, సిసింద్రీ, అతిక్‌, శ్రావణ్‌, సతీశ్‌, రాజు ఉన్నారు.

సమస్యలు పరిష్కరిస్తాం

గోదావరిఖని: సింగరేణి ఉద్యోగులు, కాంట్రా క్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గో దావరిఖని సీఎంపీఎఫ్‌ అడిషనల్‌ కమిషనర్‌ గోవర్ధన్‌ అన్నారు. ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో సోమవారం జరిగిన పింఛన్‌ సెటిల్‌మెంట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పింఛన్‌ చె ల్లింపు, సెటిల్‌మెంట్‌, సవరణ, రివైజ్డ్‌ క్లెయి మ్‌, ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ వ ర్క్‌మెన్‌ సీఎంపీఎఫ్‌ ఆడిట్‌ షీట్‌, కాంట్రాక్ట్‌ డ్రై వర్ల సీఎంపీఎఫ్‌ నంబర్‌ సమస్యల గురించి ఆ యన అవగాహన కల్పించారు. పర్సనల్‌ మే నేజర్‌ రవీందర్‌రెడ్డి, సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, డిప్యూటి పర్సనల్‌ మేనేజర్‌ వేణు, సీనియర్‌ పర్సనల్‌ అధికారులు శ్రావణ్‌కుమార్‌, హనుమంతరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ దేవాచారి తదితరులు పాల్గొన్నారు.

రియాజ్‌ను బహిష్కరిస్తున్నాం

గోదావరిఖని: యూనియన్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రియాజ్‌అహ్మద్‌ను బిహిష్కరిస్తున్నట్లు హెచ్‌ఎంఎస్‌ అధ్యక్షుడు జ క్కుల నారాయణ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ లో సోమవారం విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. నియంతృత్వపోకడ, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలతో యూనియన్‌ను దిగజార్చుతున్నారని విమర్శించారు. గుర్తింపుకార్మిక సంఘం ఎన్నికల్లో 3 నుంచి ఐదో స్థానానికి యూ నియన్‌ను దిగజార్చారని మండిపడ్డారు.

మట్టి గణపతులను పూజిద్దాం1
1/3

మట్టి గణపతులను పూజిద్దాం

మట్టి గణపతులను పూజిద్దాం2
2/3

మట్టి గణపతులను పూజిద్దాం

మట్టి గణపతులను పూజిద్దాం3
3/3

మట్టి గణపతులను పూజిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement