
నడ్డా కార్యాలయం ఎదుట ధర్నా చేయండి
సుల్తానాబాద్(పెద్దపల్లి): కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్‌రెడ్డి.. బీజేపీ ఎంపీలతో క లిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేబీ నడ్డా కా ర్యాలయం ఎదుట ధర్నా చేసి యూరియా కొరత తీ ర్చాలని ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ విసిరారు. స్థానిక ఎస్వీఆర్ గార్డెన్‌లో సోమవారం బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అవసరం మేరకు యూరియా సర ఫరా చేయకనే సమస్య ఏర్పడిందన్నారు. తాను, ఎ మ్మెల్సీ, వేర్వేరు కాదని, ఇద్దరమూ ఒకటేనన్నారు. గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్‌గౌడ్, నాయకులు వీరగోని సుజాత, వొద్ది ప్రసాద్‌రావు, కొక్కిరా ల మహేశ్వర్‌రావు, ఎలిగేడు కమలమ్మ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. నాయకులు అంతటి అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రా వు, స్వరూప, సారయ్యగౌడ్, మస్రత్, అబ్బయ్య గౌ డ్, సతీశ్, రాజేశ్వర్‌రెడ్డి, సదయ్య, సురేశ్‌గౌడ్, జానీ, దామోదర్‌రావు, రాములు పాల్గొన్నారు.