
ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆల య అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆలయ చైర్మన్‌గా చీకట్ల మొండయ్య, సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్టీపీసీ, రామగుండం, ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థల సహకారంతో ఆలయంలో గెస్ట్‌హౌస్‌లు లేదా అదనపు వసతి గదులు నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే విజయరమణరావు మా ట్లాడారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు సుప్రియ, సదయ్య, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, మూల ప్రేంసాగర్‌రెడ్డి, జడల సురేందర్, బొద్దుల లక్ష్మణ్, గొపగాని సారయ్యగౌడ్, బైరి రవిగౌడ్ పాల్గొన్నారు.