
భోజనం బాగుందా?
● ఆరా తీసిన జిల్లా జడ్జి సునీత
పెద్దపల్లిరూరల్: ‘హాస్టల్‌లో వసతులు ఎలా ఉన్నాయ్.. భోజనం బాగుందా.. వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా?’ అని జిల్లా ప్రధా న న్యాయమూర్తి సునీత విద్యార్థినులను ప్ర శ్నించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కా ర్యదర్శి స్వప్నరాణితో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలోని బాలికల హాస్టల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మె నూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన నేత్రదాన పక్షోత్సవంలో జడ్జి సునీత మాట్లాడుతూ, నేత్రదానం మహాపుణ్యకార్యమన్నారు. సదాశయ ఫౌండేషన్ ప్ర తినిధి పృథ్వీరాజ్, ఏవో రవీందర్, పీపీ రమేశ్, లైసెనింగ్ ఆఫీసర్ కోటేశ్వరరావు, సభ్యులు శ్యాంప్రసాద్, అశోక్, మహేందర్ ఉన్నారు.
ఇక సులభంగా పింఛన్ల పంపిణీ
పెద్దపల్లిరూరల్: లబ్ధిదారులకు ఇకనుంచి సులభంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలి పారు. కలెక్టరేట్‌లో పోస్టాఫీసు బ్రాంచి మేనేజ ర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్ మొబైల్, బయోమెట్రిక్ మిషన్లను సోమవారం ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, నడవలేని స్థితిలో ఉన్నవారికి ఎఫ్‌ఆర్‌ఎస్(ముఖ గుర్తింపు) ద్వారా పింఛన్లు సులభంగా అందించేందుకు 22మంది మేనేజర్లకు మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను అందిస్తున్నామన్నారు. జిల్లాలోని రామగిరి, జూలపల్లి, సుల్తానాబాద్, మంథని మండలాల పరిధిలోని 44 గ్రామాల్లో గల 6,921 మందికి వీటిద్వారా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. డీఆర్డీవో కాళిందిని, అడిషనల్ డీఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలి
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు చదువుతోపాటు ఆటలపోటీల్లో పాల్గొంటూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని డీఈవో మాధవి సూచించారు. అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో సోమ వారం క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. 18 పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొంటే మానసికంగ ధృడంగా తయారవుతారన్నారు. ఎంఈవో సు రేందర్‌కుమార్, హెచ్‌ఎం పురుషోత్తం, వేల్పు ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.