
1940 పనులు.. రూ.18.43 కోట్లు
● 22న పనుల జాతర ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 22న పనుల జాత ర పేరిట రూ.18.43కోట్లతో చేపట్టే 1,940 పను లకు శ్రీకారం చుడుతామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్వచ్ఛభారత్‌మిషన్, ఈజీఎస్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఈ వి నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. దీనికింద 35 గ్రామ పంచాయతీ, 27 అంగన్‌వాడీ భవనాలు, 2 కమ్యూనిటీ శానిటరీకాంప్లెక్స్ లు, 2 ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్లు, 2 సెగ్రిగేషన్‌షెడ్లు 260 పశువులపాకలు, 26 గొర్రెల షెడ్లు, 65 కోళ్ల ఫారాలు, 13 పాఠశాలల మరుగుదొడ్లు, 130 వర్మీకంపోస్టుగుంతలు, 13 చెక్‌డ్యాంలు, 1,300 వ్యక్తిగ త ఇంకుడుగుంతలు, 65 అజోల సాగు పనులు చే పట్టేందుకు ప్రతిపాదించామని వివరించారు. 2026 మార్చిలోగా పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా ప్ర ణాళిక సిద్ధం చేశామన్నారు. అన్ని మండల కేంద్రా ల్లో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆధార్ సవరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీవో ఆఫీసుతోపాటు పెద్దపల్లి, రామగుండం మున్సిపల్ కార్యాలయాల్లో మూడురోజులపాటు ఇవి సేవలు అందిస్తాయని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో నా ణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో స్కానింగ్ యంత్రం ప్రారంభించి మాట్లాడారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం స్థానిక ప్యాక్స్ గోడౌన్, ఎరువుల దుకాణాలు తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరి యా అందుబాటులో ఉందని, కొరత లేదన్నారు.