మిత్రుడి పేరిట స్కూల్‌.. హ్యాపీ ఫ్రెండ్సిప్‌ డే.. | - | Sakshi
Sakshi News home page

మిత్రుడి పేరిట స్కూల్‌.. హ్యాపీ ఫ్రెండ్సిప్‌ డే..

Published Sun, Aug 6 2023 12:50 AM | Last Updated on Sun, Aug 6 2023 1:23 PM

- - Sakshi

కరీంనగర్‌: పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్‌ 2002లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యాదిలో చిన్ననాటి మిత్రులు ఏదైనా చేయాలని నిర్ణయించున్నారు. గాజుల శ్రీనివాస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, యూఎస్‌ఏ సిరిసిల్ల పట్టణ శివారులో 22 గుంటల స్థలం కొనుగోలు చేసి, రూ.30 లక్షలతో 2006లో దయానంద్‌ మెమోరియల్‌ స్కూల్‌ స్థాపించారు.

 ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. రాజీవ్‌నగర్‌ కార్మిక క్షేత్రంలోని పేదవాళ్లు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్‌ నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని శ్రీనివాస్‌ భరిస్తున్నారు.

బోడ రవీందర్‌, సిరిసిల్ల తిరుపతి, కట్కం గోపి, పయ్యావుల శ్రీనివాస్‌, బి.రాము, బొడ్డు శ్రీధర్‌, లింగమూర్తి, సిరిసిల్ల తిరుమలేశ్‌, వూరడి రవి, కోడం సుధాకర్‌ పాఠశాల నిర్వహణలో భాగస్వాములవుతూ స్నేహానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement