న్యూస్‌రీల్
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం..
శుక్రవారం శ్రీ 13 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం:
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు పల్లెల్లో ప్రజాప్రతినిధుల ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న తొలి విడత (పాలకొండ డివిజన్), 16న రెండో విడత(పార్వతీపురం డివిజన్) ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. దీంతో జిల్లాలో గ్రామీణ రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
జిల్లాలో మొత్తం 15 మండలాల పరిధిలో 451 గ్రామ పంచాయతీలు, 4,128 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. మండలాలు, డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సిద్ధం చేస్తున్నా రు. 2–4 గ్రామ పంచాయతీలకు ఒక దగ్గర చొప్పు న నామినేషన్ల స్వీకరణకు 118 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం పంచాయతీల్లో సెన్సిటివ్(సమస్యాత్మక) 71, హైపర్ సెన్సిటివ్ (అతి సమస్యా త్మక) 34, క్రిటికల్ 19, సాధారణ పంచాయతీలు 327గా గుర్తించారు. మొత్తం ఏజెన్సీ పంచాయతీలు 119 ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎస్టీ అభ్యర్థులే సర్పంచులుగా పోటీ చేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు..
తొలి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జిల్లాలో పాలకొండ డివిజన్‌లోని 7 మండలాలకు సంబంధించి 227 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 18న పరిశీలన ఉంటుంది. 19న అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు. 21న మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు మూడు గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. అదే రోజు లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 38 జోన్లు, 59 రూట్లుగా విభజించారు.
●16న రెండో విడత పార్వతీపురం డివిజన్‌కు సంబంధించిన 8 మండలాల పరిధిలో 224 పంచాయతీలకు నోటిఫికేషన్‌్ వెలువడనుంది. 18 నుంచి 20వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, ఉపసంహరణ వంటి దశల అనంతరం 24న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. అనంతరం 29వ తేదీన పోలింగ్, అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపట్టనున్నారు. ఈ డివిజన్లో 39 జోన్లు, 68 రూట్లుగా విభజించారు.
ఇప్పటికే మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముగియడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు మరో కీలక ఘట్టంగా మారనున్నాయి. గ్రామస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సర్పంచి పదవులతో పాటు వార్డు సభ్యుల స్థానా లపైనా దృష్టి సారిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో స్థానిక నాయకులు, ఆశావహులు తమ ప్రయత్నా లను ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
జిల్లాలోని 451 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైన సామగ్రిని మండలాలకు, పంచాయతీలకు తరలిస్తున్నాం. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కాగానే.. అందుకు సంబంధించిన ప్రక్రియ జిల్లాలో ప్రారంభిస్తాం. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ లేదా సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంటుంది. – ఎస్.రవీంద్ర, జిల్లా పంచాయతీ అధికారి


