● పోలీస్ అధికారులకు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు ● వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ మాధవ్‌రెడ్డి
పార్వతీపురం రూరల్: ఈ నెల 26న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచే ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తలు వహించా లని, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో పటిష్ట బందోబస్తు
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేయనున్నట్లు ఎస్పీ మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచుతా మని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు పునరా వృతం కాకుండా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.


