● పర్యాటక ప్రాంతాల్లో కలెక్టర్, ఇన్‌చార్జ్ పీఓ సందడి ● అడ్వెంచర్ పార్కు టు బెనరాయి జలపాతం వరకు బైక్‌పై టూర్
సీతంపేట: మన్యం సవారీ ఎకోబైక్ ర్యాలీని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆధ్వర్యంలో గురువారం సీతంపేటలో నిర్వహించారు. వివి ధ శాఖల అధికారులు, సిబ్బంది యువత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక అడ్వెంచర్ పార్కు నుంచి బెనరాయి జలపాతం వరకు బైక్‌పై సుమారు 12 కిలోమీటర్ల టూర్ నిర్వహించారు. బెనరాయి ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉందని, రాత్రి సమయంలో క్యాంపింగ్ టెంట్‌లలో కూడా స్టే చేయవచ్చని కలెక్టర్ అన్నారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. అంతకుముందు స్థానిక గ్రామస్తులతో మాట్లాడి వారితో సహపంక్తి భోజనం చేసి ఫొటోలు దిగారు. త్వరలో ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.


