జపాన్‌ పర్యటనకు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జపాన్‌ పర్యటనకు కలెక్టర్‌

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

జపాన్‌ పర్యటనకు కలెక్టర్‌ ● ఏపీ నుంచి ఏకై క ఐఏఎస్‌ ఎంపిక ఉన్నతాధికారులకు మర్యాదపూర్వక స్వాగతం

సాక్షి, పార్వతీపురం మన్యం: నీతి ఆయోగ్‌, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ సంయు క్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జపాన్‌ అధ్యయన పర్యటనకు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి వెళ్తున్నారు. ఈ పర్యటనకు దేశవ్యాప్తంగా ఎంపికై న 18 మంది ఐఏఎస్‌ అధికారుల్లో ఆయన కు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ పర్యటనకు ఎంపికై న ఏకై క ఐఏఎస్‌ అధికారిగా ఆయన నిలిచారు. ఈ పర్యటనకు అవసరమైన శాఖాపరమైన అనుమతులు కూడా పొందారు. నీతి ఆయోగ్‌ అమలు చేస్తున్న ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం కింద నిర్దేశించిన కీలక పనితీరు సూచికల సాధనలో ఆయన ఆధ్వర్యంలో పురోగతి నమోదైంది. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో లక్ష్యాల సాధనకు తీసుకున్న చర్యలు ఈ గుర్తింపునకు ప్రధాన కారణంగా నిలిచా యి. ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్వహించిన డెల్టా ర్యాంకింగ్‌లో మూడు సందర్భాల్లో ఆయన ప్రథమ అవార్డులు సాధించారు. వివిధ ప్రభుత్వ శాఖ ల సమన్వయం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ, ఫలి తాల ఆధారిత కార్యాచరణతో పాటు సమగ్ర పనితీరు ద్వారా రూ.8 కోట్ల ప్రోత్సాహక నిధులు కూడా సాధించారు.

ఆధునిక పరిపాలన విధానాలపై అధ్యయనం

జపాన్‌ అధ్యయన పర్యటనలో భాగంగా అక్క డి ఆధునిక పరిపాలనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ప్రజారోగ్యం, వ్యవసాయ ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి అంశాలను అధ్యయనం చేయనున్నారు. అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను భారతదేశంలోని ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల అభివృద్ధికి అన్వయించే అవకాశాలను పరిశీలించనున్నారు. సుమారు పది రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రయాణం కానున్నా రు. అంతవరకూ ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ బాధ్యతలను ఇన్‌చార్జ్‌ జేసీ వైశాలికి అప్పగించారు.

పూసపాటిరేగ: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్‌కు విచ్చేసిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్నలకు కలెక్టర్‌ స్వాగతం పలికారు. ఈ మేరకు భోగాపురంలోని అల్లూరిసీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కలెక్టర్‌ ఎస్‌. రాంసుందరరెడ్డి, ఐజీపీ గోపీనాథ్‌ జెట్టీ, ఎస్పీ ఎఆర్‌ దామోదర్‌లు గురువారం వారిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతించారు.

సంక్షేమ వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు

విజయనగరం లీగల్‌: విజయనగరం పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఎ.కృష్ణప్రసా ద్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రీ–మెట్రిక్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర వసతి గృహం, పోస్టుమెట్రిక్‌ ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర వసతిగృహం–2, పోస్టు మె ట్రిక్‌ ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2ల ను ఆయన సందర్శించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయా లు, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగు దొడ్లు, విద్యుత్‌ సౌకర్యం, వంటగది, భోజన వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, ఆరోగ్యకరమైన వాతావరణం, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం సంబంధిత అధికారుల బాధ్యత అని జడ్జి పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement