ఒడిశా నుంచి రక్షణకు చెట్లు నరికి,
రాళ్లు వేసి దారి మూసివేత
దారి క్లియర్ చేసి గ్రామాలకు చేరుకున్న ఒడిశా అధికారులు, పోలీసులు
నేరెళ్లవలసలో పోలింగ్ సామగ్రిని, జాయింట్‌కలెక్టర్ వైశాలిని అడ్డుకున్న ఒడిశా అధికారులు, నేతలు
రహస్యంగా అటవీమార్గం గుండా కింద పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న గిరిజనులు
సాలూరు:
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు నాటి స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారితో పోరాడి న భారతీయులను తలపించేలా కొఠియా గ్రూప్ గ్రామాల గిరిజనులు పరిస్థితి మారింది. వివరాల్లో కి వెళితే వివాదాస్పద ఆంధ్రా ఒడిశా కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఆంధ్రా ప్రభుత్వం పరిషత్ ఎన్ని కల నిర్వహణకు సిద్ధమైంది. అయితే ఈ ఎన్నికల ను అడ్డుకోవడానికి ఒడిశా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తూ, పోలీసు బలగాలను మోహరించింది. ఆంధ్రాలో జరిగే ఎన్నికల్లో పాల్గొనవద్దని కొఠి యా గ్రామాల ప్రజలపై ఒత్తిడితీసుకువచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నేరెళ్లవలస వెళ్లిన రేషన్ లారీని అడ్డుకోవడంతో పాటు ఒడిశా ప్రత్యేక బలగాలను పెట్టి ఆంధ్రా అధికారులను అడ్డుకున్నారు. ఆంధ్రా పోలీసులు, ఒడిశా పోలీసుల మధ్య తోపులాట జరి గిని విషయం విదితమే. స్థానిక గిరిజనులు ఆగ్రహించి ఒడిశా పెట్టిన బారికేడ్లును తోసివేసిన క్ర మంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అధిక సంఖ్యలో ఒడిశా ప్రత్యేక పోలీసు బలగాలు కొఠియా గ్రామాల్లో మోహరించాయి.
చెట్లు కొట్టి, రాళ్లు అడ్డుగా పెట్టి
కొఠియా గ్రామాల్లో ప్రజలు ఆంధ్రా ఎన్నికలకు వెళ్లకుండా బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలను ఒడిశా పోలీసులు సీజ్ చేస్తున్నారు.గిరిజనులకు రక్షణ కరువైన పరిస్థితి నెలకొంది. దీంతో పట్టుచెన్నే రు, పగులుచిన్నేరు, సొల్పగుడ, కోనదొర, ఎగువమెండంగి, డోలియాంబ, ముడకారు, బర్నిగూడ గ్రామాల గిరిజనులు ఐక్యంగా తామంతా ఆంధ్రాలోనే ఉండాలని, ఒడిశాతో ఉండమని నిర్ణయించా రు. తమ గ్రామాలకు ఒడిశా అధికారులు, పోలీసులు వచ్చి ఇబ్బందులకు గురిచేసి ఓటు వేయకుండా చేసే కుట్రలు పన్నడంతో గిరిజనులంతా తమ గ్రామాలకు ఒడిశా నుంచి వచ్చే దారులను మూసివేశారు. అందులో భాగంగా పెద్ద పెద్ద చెట్లు నరికి, పెద్ద బండరాళ్లను దారికి అడ్డుగా వేసి ఒడిశా అధి కారులను తమ గ్రామాలకు రాకుండా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి తాము ఇంత కష్టాలు పడుతున్నా ఆంధ్రా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ గ్రామాలన్ని వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉంటున్నాయనే, కూటమి నేతలు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి. మరో వైపు గిరిజనులు అడ్డుగా వేసిన చెట్లను మిషన్ కట్ట ర్‌లతో తొలగించి పక్కకు తీసి ఒడిశా అధికారులు, పోలీసులు పట్టుచెన్నేరు, పగులుచిన్నేరు గ్రామాలకు చేరారు.
జేసీని అడ్డుకున్న ఒడిశా నేతలు, అధికారులు
నేరెళ్లవలస గ్రామంలో పోలింగ్‌బూత్‌లో పోలింగ్ సామగ్రి పెట్టడానికి వెంట వెళ్లిన జాయింట్ కలెక్టర్ వైశాలి, సబ్‌కలెక్టర్ సచిన్ ఆర్చిత్ రహార్‌ను ఒడిశా అధికారులు, నేతలు అడ్డుకున్నారు. ఇక్కడ ఎన్నికల ను నిర్వహించరాదని అడ్డుకుంటూ ఆంధ్రా గోబ్యా క్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని గుర్తించిన జేసీ సంయమనం పాటించి వెనుదిరిగారు. కొఠియా గ్రామాల్లో ఏర్పడిన ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నేరెళ్లవలస నుంచి సారికకు పోలింగ్ బూత్‌ను మార్చినట్లు జేసీ తెలిపారు.
అటవీమార్గం గుండా ఓటర్లు కిందికి..
ఈ 21 గ్రామాలకు సంబంధించి 2,883 మంది ఓటర్లు సారిక, కురుకుట్టి, తోణాం, నేరెళ్లవలసలలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. నేరెళ్లవలస బూత్‌ను సారికకు మార్చిన క్రమంలో స్థానిక నేతలు ఆయా గ్రామాల్లో గిరిజన ఓటర్లను ఒడిశా అధికారులు, పోలీసులకు తెలియకుండా ప్రత్యామ్నాయ అటవీమార్గం గుండా జోరు వానలో రాళ్లు,రప్పలు దాటుతూ, వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, కిందన ఉన్న పోలింగ్ కేంద్రాలకు రాత్రి వేళ కూడా తీసుకు వస్తున్నారు.


