ఎన్నికలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

799 పోలింగ్‌ కేంద్రాలకు 900 మంది పోలీసులతో భద్రత

ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి వెల్లడి

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా 15 మండలాల పరిధిలోని 799 పోలింగ్‌ కేంద్రాల వద్ద సుమారు 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీల టెంట్లు ఏర్పాటు చేయరాదన్నారు. క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు అవసరమైన భద్రత, సహకారం అందించాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement