విధివంచిత కుటుంబం | - | Sakshi
Sakshi News home page

విధివంచిత కుటుంబం

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

విధివంచిత కుటుంబం ● రైలు ఢీకొని మూగ, చెముడు వ్యక్తి మృతి ● మృతుడి భార్య, కుమారుడు దివ్యాంగులు

● రైలు ఢీకొని మూగ, చెముడు వ్యక్తి మృతి ● మృతుడి భార్య, కుమారుడు దివ్యాంగులు

సీతానగరం: కుటుంబ పెద్ద మూగ, చెముడు వైకల్యం కలిగిన వ్యక్తి. ఆయన భార్య, కుమారుడు దివ్యాంగులు. కుటుంబ పెద్ద ప్లాస్టిక్‌ సంచులు, ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ ఏరుకుంటూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఆ విధికి ఇంకా ఆ కుటుంబంపై కక్ష తీరలేదేమో.. ప్రమాదం రూపంలో కుటుంబపెద్దను మృత్యుఒడికి లాక్కెళ్లింది. దీంతో భార్యాకుమారుడు అనాథలయ్యారు. సీతానగరం రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండల కేంద్రంలో నివాసం ఉంటున్న శ్రీకాకుళపు గోపాలరావు ప్లాస్టిక్‌ సంచులు, ఖాళీ వాటర్‌ బాటిల్స్‌ ఏరుకుని జీవనం సాగిస్తున్నాడు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ను ఆనుకుని నడుస్తుండగా చెముడు, మూగ వ్యక్తి కావడంతో రైలు రాకను గుర్తించలేకపోయాడు. దీంతో రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం మృతుడి భార్య మీనాకుమారి, కుమారుడు జగదీష్‌లకు తెలియజేసినా వారిద్దరూ దివ్యాంగులు, పేద కుటుంబం వారు కావడంతో సంఘటనా స్థలానికి రాలేక లబోదిబోమంటున్నారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారని స్థానికులు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement