కొఠియా, గంజాయిభద్ర, నేరెళ్లవలస, గాలిగబడారు గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద ఒడిశా పోలీసులను మోహరించి, గిరిజనులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు బయటకు వెళ్లకుండా, నిత్యకృత్యాలకు కూడా అడ్డగిస్తూ దిగ్బంధం చేస్తున్నార స్థారనిక గిరిజనులు వాపోతున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2021లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒడిశా అధికారులు ఈవిధంగానే నాడు బారికేడ్లు పెట్టి అడ్డగించారు. అయితే ఆనాటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక దృష్టిసారించి, నాటి ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు, ప్రజలు ఈ బారికేడ్లును తొలగించి స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఒడిశా బారికేడ్లు తొలగించి, ఎదురించి ఎన్నికలు జరిపిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోని సంఘటనలను కొఠియా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.


