విజయనగరం అర్బన్: నగరపాలక సంస్థ ఎన్నికలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన భార్యాభర్తలు విజయం సాధించి, ప్రత్యేకతగా నిలిచారు. అధికార కూటమి అభ్యర్థులను వెనక్కి నెట్టి మరీ పిన్నింటి సూర్యనారాయణ, కళావతి దంపతులు గెలిచి ఈ ఘనత సాధించారు. 51వ డివిజన్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిన్నింటి సూర్యనారాయణ..జనసేన అభ్యర్థి పి.చంద్రశేఖర్‌పై గెలవగా 48వ డివిజన్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆయన భార్య కళావతి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కె.శకుంతలను ఓడించారు. కళావతికి ఇది వరుసగా మూడో విజయం కాగా ఆమె హ్యాట్రిక్ విజయాన్ని అందరూ అభినందిస్తున్నారు.


