పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు! | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు!

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

అందుబాటులో ఉంటాయని డీపీటీసీ అధికారిణి వరలక్ష్మి పేర్కొన్నారు. ఈ సౌకర్యం పొందాలనుకునే భక్తులు ఫోన్‌ 7382924103 నంబరును సంప్రదించాలని సూచించారు.

శ్రీశైలానికి కార్తీక

మాసమంతా బస్సులు

శ్రీ భ్రమరాంబ మల్లికా ర్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం కార్తీక మాసం మొత్తం శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. విజయనగరం బస్టాండ్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే సూపర్‌ లగ్జరీ బస్సు మూడో రోజు ఉదయం 10 గంటలకు తిరిగి విజయనగరం చేరుకుంటుదన్నారు. విజయనగరం నుంచి శ్రీశైలానికి ఒక్కొక్కరికి ఒకవైపు ప్రయాణానికి రూ.1,340 టికెట్‌ ధరగా నిర్ణయించారు. పంచారామాలు, శ్రీశైలం యాత్రలకు సంబంధించిన టికెట్లను aprtc.onine.in వెబ్‌సైట్‌తో పాటు విజయనగరం బస్టాండ్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ఆయా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సరిపడా ఉంటే, ప్రకటించిన ధరలకే కోరిన ఇతర తేదీల్లోనూ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని డీపీటీటీఓ అధికారిణి వరలక్ష్మి స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు సిస్టమ్‌ సూపర్‌వైజర్‌ ఫోన్‌ 9440359596, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) ఫోన్‌ 7382924103, డిపో మేనేజర్‌ ఫోన్‌ 9959225620 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

విజయనగరం క్రైమ్‌: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాల సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం డిపో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పంచారామాలు, శబరిమల, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి బుధవారం తెలిపారు. భక్తులు ముందస్తుగా టికెట్లు రిజర్వేషన్‌ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఒకే యాత్రలో ఐదు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలను దర్శించుకునేలా ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నవంబర్‌ 15, 22, 29, డిసెంబర్‌ 6 తేదీల్లో (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు విజయనగరం బస్టాండ్‌ నుంచి బస్సులు బయలుదేరుతాయి. సోమవారం పంచారామ క్షేత్రాల దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమై మంగళవారం ఉదయం 6 గంటలకు విజయనగరం చేరుకుంటాయి. సూపర్‌ లగ్జరీ బస్సులో ఒక్కొక్కరికి రూ.2,000, అల్ట్రా డీలక్స్‌ బస్సులో రూ.1,950 టికెట్‌ ధరగా నిర్ణయించారు. శబరిమలకు కోరిన తేదీల్లో బస్సులు అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తుల కోసం వారు కోరిన తేదీల్లో శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. 38 సీట్ల సెమీ పుష్‌బ్యాక్‌ బస్సులు

విజయనగరం డిపో నుంచి సర్వీసులు

భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ ఆర్టీసీ ఏర్పాట్లు

టికెట్ల రిజర్వేషన్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement