బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● విజయనగరం డీఎస్పీ ఎస్‌.

లక్ష్మణమూర్తి

విజయనగరం టౌన్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అంతా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని విజయనగరం డీఎస్పీ ఎస్‌.లక్ష్మణమూర్తి కోరారు. జిల్లా కేంద్రంలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సిబ్బందితో బుధవారం సమావేశమైన ఆయన..విజయనగరం సబ్‌డివిజన్‌ పరిధిలో ఉన్న విజయనగరం, గంట్యాడ ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో మాత్రమే పార్టీ టెంట్లు ఉండేలా చూడాలన్నారు. ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేయకుండా నాయకులు ఉండాలని, పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్‌ఐ వి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement