మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

విజయనగరం అర్బన్‌: బ్రిక్స్‌–సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా స్థానిక సత్య డిగ్రీ కళాశాలలో సుస్థిర ఆహార వ్యవస్థను ఆచరిద్దాం అనే అంశంపై బుధవారం అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని ప్రిన్సిపాల్‌ ఎంవీ సాయిదేవమణి అన్నారు. రోజూ తినే ఆహారంలో పౌష్టికాహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని, శారీరక ఆరోగ్యానికి వ్యాయామం, మానసిక ప్రశాంతతకు యోగా, ధ్యానం చేయాలన్నారు. అలాగే విద్యుత్‌, నీటిని పొదుపుగా వాడాలని, పర్యావరణం కాలుష్యం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బోటనీ అధ్యాపకుడు వై.శంకర్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ కో–ఆర్డినేటర్‌ తరుణ్‌కుమార్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement