స్ట్రాంగ్‌రూం తాళం మాయం..
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/పాలకొండ రూరల్/సాలూరు: ఉత్కంఠ వీడింది. పుర ఫలితాలు తేలిపోయాయి. మెజార్టీ స్థానా లు అధికార పార్టీకే అనుకూలంగా వచ్చాయి. అటు వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు.. పలుచోట్ల రెబల్స్, ఇండిపెండెంట్లు గట్టి పోటీ ఇవ్వడంతో.. ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ రేగింది. గెలిచిన వ్యక్తులు సంబరాలతో, బాణసంచా మోతలతో సంతోషంగా వెళ్లగా.. ఓడిన అభ్యర్థులు నిరుత్సాహంగా ఇంటి బాట పట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి పాలకొండ చైర్పర్సన్ పీఠాన్ని జనసేన (10,859 ఓట్లు) కై వసం చేసుకుంది. ఇక్కడ పి.విజయనిర్మల చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. నగర పంచాయతీలో మొత్తం 677 ఓట్లు చెల్లనవిగా ఉన్నాయి. 119 ఓట్లు నోటాకు పడ్డాయి. పార్వతీపురం చైర్‌పర్సన్‌గా బెలగాం కరుణ గెలు పొందారు. సాలూరు ఇంకా తేలాల్సి ఉంది. అర్ధరాత్రి తర్వాత వరకు లెక్కింపు కొనసాగుతోంది.
రాత్రి వరకూ లెక్కింపు
జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్వతీపురంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో దాదాపు గంటన్నరకు పైగా లెక్కింపు ప్రక్రియలో జాప్యమైంది. సాలూరులో సైతం నిర్ణీత సమయంలో ప్రారంభం కాలేదు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఈ ప్రక్రియలో దాదాపు మూడు చోట్ల అధికార కూటమి అభ్యర్థులకే అధిక ఓట్లు పడ్డా యి. తర్వాత రౌండ్ల వారీ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల.. రాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడి కాలేదు. పార్వ తీపురం, సాలూరు దాదాపు అర్ధరాత్రి వరకూ కొనసాగింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్వతీపురం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి 34వ వార్డుకు వచ్చే సరికి బాక్సు మారిపోయినట్లు వైఎస్సార్సీపీ, జనసేన ఏజెంట్లు గుర్తించారు. సీల్ వేసిన వస్త్రం మీద ఏడుగురు సంతకాలు చేస్తే.. తర్వాత చూసినప్పటికీ ఒక్క టీడీపీ వ్యక్తి సంతకమే ఉంది. దీనిపై వైఎస్సార్సీపీ, జనసేన ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫలించిన అధికార పార్టీ కుట్రలు
స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలకు తెర తీసింది. నయానో భయానో ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. దీని ఫలితంగానే మెజార్టీ స్థానాలు దక్కించుకోగలిగింది. దీనికి తోడు పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగా సాగినా.. చివరి నిమిషాల్లో అమాంతం పెరగడంపైనా అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి ఫలితమే.. ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీలకు అనుకూలంగా రావడానికి కారణమని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలకు తెర తీసినా... కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు బలమైన పోటీ ఇచ్చారు.
సాలూరు పురపాలక సంఘంలో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. మొత్తం 32 వార్డుల్లో అత్యధికంగా 13 వార్డులను కై వసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ 11, జనసేన 4, స్వతంత్రులు 3, బీజేపీ 1 చొప్పున దక్కించుకున్నాయి. చైర్పర్సన్ ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బవిరెడ్డి రిబ్కారాణి ముందంజలో ఉన్నారు. అర్ధరాత్రి సమయానికి రెండో రౌండ్ లెక్కింపు పూర్తి కాగా.. 5775 ఓట్లు పొంది తన సమీప అభ్యర్థి గొర్లె విజయకుమారి కంటే 333 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
(19వ వార్డు ఏకగ్రీవం జనసేన)
పార్వతీపురంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పోలింగుకు సంబంధించి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బ్యాలెట్ బాక్సులను భద్రం చేసిన స్ట్రాంగ్‌రూం తాళాలు మాయమయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగు ప్రారంభం కావాల్సి ఉన్నా... తాళాలు దొరక్కపోవడంతో 9.30 వరకూ ప్రారంభం కాలేదు. చివరికి తాళాలను పగలగొట్టాల్సి వచ్చింది. మున్సిపల్ మేనేజర్ వద్ద ఉండాల్సిన తాళాలు.. చేతులు మారినట్లు సమాచారం. చివరిగా మాస్టర్ ట్రైనీగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు పోలినాయుడుకు అప్పగించానని ఆయన చెప్పినట్లు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత కరెంటు పోయి, దాదాపు మూడు గంటల సమయం పాటు రాలేనట్లు తెలుస్తోంది. పోలింగుకు, ఓట్ల లెక్కింపునకు మధ్యలో ఒక రోజే సమయం ఉంది. ఈ మధ్యలో తాళాలు పోవడం, అర్ధరాత్రి కరెంటు అంతరాయం.. పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటికే రిగ్గింగు ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు ఓట్ల తారుమారు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తేలిన పుర ఫలితాలు
కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం
పార్వతీపురంలో స్ట్రాంగ్‌రూం తాళాలు మాయం
సాలూరులో సత్తా చాటిన వైఎస్సార్సీపీ
పార్వతీపురం, పాలకొండల్లో కూటమి అభ్యర్థులు విజయం
ఫలించిన అధికార పార్టీ కుట్రలు


