జగనన్నతోనే అభివృద్ధి, సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే అభివృద్ధి, సంక్షేమం

Nov 4 2026 6:40 AM | Updated on Nov 4 2026 6:40 AM

కొమరాడ: గిరిజనుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు అన్నారు. జగనన్న పాలనలో గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కొమరాడ మండల కేంద్రంతో పాటు చోళ్లపధం తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి కొండగొర్రి రామలక్ష్మి, స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పరీక్షిత్‌ రాజు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. గిరిజనుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలిచే పార్టీ వైఎస్సార్‌సీపీ అని స్పష్టం చేశారు.

గ్రామాల భవిష్యత్తు స్థానిక ఎన్నికలు

స్థానిక ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైనవని పేర్కొంటూ, గ్రామాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ బలపరిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కొండగొర్రి రామలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థులు దాసరి నవీన్‌, హిమరక గౌరి, శంకర్‌ రావు, కేతిరెడ్డి ప్రశాంతి, వైఎస్సార్‌సీపీ నాయకులు మరడాన సూరపు నాయుడు, మరడాన సింహాచలం నాయుడు, చిన్న సుధ, మీనక తవిటియ్య తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీతోనే భరోసా

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement