● పార్టీలోకి ఆహ్వానించిన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి
తెర్లాం: మండలంలోని ఉద్దవోలు గ్రామంలో పలు కుటుంబాల వారు టీడీపీని వీడి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో మంగళవారం చేరారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో వారంతా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన వారందరికీ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోనే వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన తెలిపారు. పార్టీలో చేరిన వారంతా గ్రామంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని, ఈనెల 5న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెర్లాం జెడ్పీటీసీ అభ్యర్ధి బొమ్మి శ్రీనివాసరావును, ఉద్దవోలు ఎంపీటీసీ అభ్యర్ధి పలగర లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కష్టపడి పనిచేస్తామని వారంతా అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు, ఉద్దవోలు గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


