● మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరిన 200 కుటుంబాలు
రామభద్రపురం: గిరిజన గ్రామాల్లో బోర్లు తీస్తామని, రోడ్డు వేస్తామని, పింఛన్లు, ఇళ్లు మంజూరు వంటి సంక్షేమ పథకాలు ఇస్తామని టీడీపీ నాయకులు బొబ్బిలి కోటకు తీసుకెళ్లి ఎమ్మెల్యే బేబీనాయనతో పార్టీ కండువాలు వేయించి మోసం చేశారని మండలంలోని రావివలస, ఆర్. చింతలవలస, ఎనుబరువు గ్రామాలకు చెందిన గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. బోర్లు ఎప్పుడు వేస్తారని అడిగితే టీడీపీ నాయకులు మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.టీడీపీ నాయకుల మాటలు నమ్మి కండువాలు వేసుకుని మోసపోయామని, ఇక నుంచి అలా జరగకుండా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇస్తూ మీ వెంట నడుస్తామని చెప్పారు. దీంతో రావివలస పచాయతీ తాజా మాజీ సర్పంచ్ సోముల కుమారి ఆధ్వర్యంలో మంగళవారం రావివలస, ఆర్ చింతలవలస, ఎనుబరువు గ్రామాల్లో 200 కుటుంబాలు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారందరికీ మాజీ సర్పంచ్ కుమారి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.దుంబిరి లక్ష్మి, పేటూరి సీతమ్మ, రూడిజన్ని లావణ్య, దుంబిరి పెద్దమ్మి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మీసాల రామారావు, మరడ అప్పారావు, రైతు తవుడు తదితరులు పాల్గొన్నారు.


