బందోబస్తు నడుమ మున్సిపల్‌ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

బందోబస్తు నడుమ మున్సిపల్‌ ఎన్నికలు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

బందోబస్తు నడుమ మున్సిపల్‌ ఎన్నికలు ● కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ బందోబస్తు నడుమ జాగ్రత్తగా నిర్వహించామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై సోమవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, ఓటర్లకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్‌ సామగ్రి, విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు.

పటిష్ట భద్రత

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడం వల్ల పోలింగ్‌ ప్రక్రియ అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన ఓటర్లకు, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మున్సిపల్‌ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరూ ఇదే విధమైన సహకారం అందించాలని కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement