పరిషత్‌ ఎన్నికలకు రెడీ | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ఎన్నికలకు రెడీ

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

చికెన్‌ బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ130 శ్రీ230 శ్రీ240

చికెన్‌

విజయనగరం రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆదివారంతో పురపోరుకు తెరపడగా, పరిషత్‌ పోరు మొదలైంది. ఈనెల 5న జరగనున్న పరిషత్‌ పోరుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని 27 జెడ్పీటీసీ, 449 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి జెడ్పీటీసీ స్థానాలకు 258 నామి నేషన్లు దాఖలు కాగా ఎంపీటీసీ స్థానాలకు 2577 నామి నేషన్లు దాఖలయ్యాయి. 449 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 స్థానాలు ఏకగ్రీవం కాగా 438 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 27 జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ నుంచి 27 మంది, తెలుగుదేశం పార్టీ నుంచి 22 మంది జనసేన పార్టీ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ నుంచి 21 మంది, స్వతంత్ర అభ్యర్థులు 23 మంది, ఇతర పార్టీల నుంచి మరో నలుగురు ఎన్నికల బరిలో నిలిచారు.

1586 పోలింగ్‌ కేంద్రాలు

ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు గాను జిల్లాలో 1586 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 27 మండలాల్లో 12,85,691 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

జిల్లాలో ఈనెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5గంటలతో తెరపడనుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌. రామ్‌సుందర్‌ రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే ప్రచార గడువు ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేని రాజకీయ నాయకులు, స్టార్‌ క్యాంపెయినర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆయా ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మైకులు, లౌడ్‌ స్పీకర్లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని, ఇంటింటి ప్రచారం సైతం ఎన్నికల నిబంధనలకు లోబడి మాత్రమే చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపులు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే సందేశాలు, ప్రకటనలు పంపడంపై సైబర్‌ విభాగం నిఘా ఉంచుతుందని కలెక్టర్‌ తెలిపారు. ప్రచారం ముగిసిన సమయం నుంచి పోలింగ్‌ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుందని, సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీ య పక్షాలు, అభ్యర్థులు, ఓటర్లు సహకరించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

అధికారులకు కలెక్టర్‌ సూచనలు

ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ సరళికి సంబంధించిన వివరాలను నిర్దేశిత సమయానికి కంట్రోల్‌ రూమ్‌కు అందించాలి.

పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో గ్రఫీ, సీసీటీవీ ఫుటేజీ ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి.

బ్యాలెట్‌ పేపర్లు, స్టేషనరీ, ఇతర ఎన్నికల సామగ్రిని ముందుగానే తనిఖీ చేసి సిద్ధంగా ఉంచాలి.

ఓటర్‌ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేయాలి. పోలింగ్‌ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ, రూట్‌ వెరిఫికేషన్‌, రవాణా ఏర్పాట్లు పక్కాగా చేయాలి.

పోలింగ్‌ సిబ్బందిని రిసెప్షన్‌ కేంద్రం వద్ద దించి వాహనాలు వెళ్లిపోకుండా, వారిని బస్టాండ్‌కు చేర్చే వరకు రవాణా సౌకర్యం కల్పించాలని. పోలింగ్‌ సిబ్బందికి తాగునీరు, భోజనం, అల్పాహారం, రాత్రి భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్‌ నిర్వహించిన వెబెక్స్‌ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, డీఆర్‌ఓ సీహెచ్‌. సత్తిబాబుతో కలిసి ఆర్డీఓలు, డీఎల్డీఓలు, రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, నోడల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో సంబంధిత ఎన్నికల అధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

27 జెడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు పోటీ

జెడ్పీటీసీ బరిలో 103 మంది,

ఎంపీటీసీ స్థానాలకు 1069

మంది పోటీ

1586 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం

ఓటు హక్కు వినియోగించుకోనున్న 12,85,691 మంది ఓటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement