● గెలిచేదెవరో? ఓడేదెవరు? ● పుర ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

● గెలిచేదెవరో? ఓడేదెవరు? ● పుర ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● గెలిచేదెవరో? ఓడేదెవరు? ● పుర ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

సాక్షి, పార్వతీపురం మన్యం: పట్టణ ఓటర్ల తీర్పు మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ఈ నెల ఒకటో తేదీన జరిగిన జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపల్‌, పాలకొండ నగర పంచాయతీ ఎన్నిక ల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం ఎనిమిది గంటలకు ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సాలూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలకొండలోని బాలికల కళాశాల కేంద్రాల్లో లెక్కి ంపు జరగనుంది. ఇందుకోసం ఇక్కడ మొత్తం 34 కౌంటింగు టేబుళ్లను ఏర్పాటు చేశారు. పార్వతీపురంలో 16, సాలూరులో 11, పాలకొండలో ఏడు కౌంటింగు టేబుళ్లు చొప్పున ఉన్నాయి. రౌండు వారీ బ్యాలెట్‌ పేపరు లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపును ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్‌రెడ్డి తెలిపారు. కౌంటింగు కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతోపాటు.. సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

అనుమతి పొందిన ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం

పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బి.రామగోపాల్‌ తెలిపారు. ప్రతి రౌండుకూ ఆరు వార్డులు చొప్పున వార్డుల వారీ ఆరు రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నామని చెప్పారు. మొదటి రౌండులో 1 నుంచి 6 వార్డులు, 2వ రౌండులో 7–12, 3వ రౌండులో 13–18, 4వ రౌండులో 16–25, ఐదో రౌండులో 25–30, ఆరో రౌండులో 31 –36 వార్డుల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. అనుమతి మంజూరు చేసిన కౌంటింగు ఏజెంట్లకు మాత్రమే లోపలికి ప్రవేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వార్డు కౌన్సిలర్‌కు కౌంటింగ్‌ ఏజెంటు ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థికి ముగ్గురు కౌంటింగు ఏజెంట్లు రావచ్చని తెలిపారు. కౌంటింగు హాలులోపలికి సెల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించబోమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement