లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ● ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులతో కలిసి ప్రతి కౌంటింగ్‌ కేంద్రాన్ని భౌతికంగా తనిఖీ చేసి, భద్రతా లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాలను సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్య వేక్షించనున్నారు. ప్రవేశ మార్గాల వద్ద బహుళ అంచెల తనిఖీలు నిర్వహించి, అధికారిక గుర్తింపు ఉన్నవారిని మాత్రమే లోపలికి అను మతిస్తారు. ఏజెంట్లు ఇష్టానుసారం బయటకు వెళ్లి వచ్చేందుకు వీల్లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. లెక్కింపు టేబుళ్లకు, ఏజెంట్లకు మధ్య సురక్షితమైన మెష్‌ ఏర్పాటు చేసి బ్యాలెట్‌ పత్రాలకు రక్షణ కల్పిస్తారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అగ్గిపెట్టెలు, లైటర్లు, సిరా, మండే ద్రవాలు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రక్రియ అత్యంత సున్నితమైనది కావడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, అత్యవసర పరిస్థితుల కోసం క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ (క్యూఆర్టీ), రిజర్వ్‌ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement