తెలుగుదేశం పార్టీకి బైబై చెబుతూ వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు టీడీపీకి గుండెపోటు తెప్పిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో తెలుగు దేశం పార్టీకి చెందిన వారు వైఎస్సార్‌సీపీలో చేరుతూనే ఉన్నారు. తద్ | - | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీకి బైబై చెబుతూ వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు టీడీపీకి గుండెపోటు తెప్పిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో తెలుగు దేశం పార్టీకి చెందిన వారు వైఎస్సార్‌సీపీలో చేరుతూనే ఉన్నారు. తద్

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

గుర్ల: చంద్రబాబు చేస్తున్న పరిపాలనకు విసుగు చెందిన మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాల వారు టీడీపీ, జనసేన పార్టీలను వీడి వైఎస్సార్‌సీపీలో సోమవారం చేరారు. పార్టీలో చేరిన బొద్దాన అప్పన్న, కోల ఆదినారాయణ, కోల సత్యం, బొద్దాన గణేష్‌, గొరుబిండి అప్పలనాయుడు, బాగు సూరిబాబు, బొద్దాన రమేష్‌, మీసాల శ్రీను, శేషపు రమణ, రెడ్డి సత్యనారాయణ, వాళ్లె సతీష్‌, రెడ్డి రాంబాబు, బొద్దాన అప్పయ్య, బొద్దాన చిన్న రమణలకు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద సోమవారం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.

బొత్స అనూష సమక్షంలో మరో 20 కుటుంబాలు

అలాగే మండలంలోని గిరిడ, జమ్ముపేట గ్రామాల నుంచి మరో 20 కుటుంబాలు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త బొత్స అనూష సమక్షంలో వైఎస్సార్‌సీపీలో ఆదివారం రాత్రి చేరారు. పార్టీలో చేరిన దాసరి పైడినాయుడు, దాసరి ప్రియాంక, రెడ్డి సూరిబాబు, గేదెల చిన్న, బిల్లాన శ్రీను, గునాటి అప్పన్న, బిల్లాన చిన్న, బిల్లాన ఆదినారాయణ, గిడిజాల నరసింహమూర్తి, బిల్లాన సీతారాం, బిల్లాన ఇందిరలకు బొత్స అనూష, జెడ్పీటీసీ అభ్యర్థి సంగం రెడ్డి వెంకటలక్ష్మి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కేవీ సూర్యానారాయణ రాజు, పొట్నూరు సన్యాసినాయుడు, శీర అప్పలనాయుడు, తిరుమరెడ్డి సూరిబాబు, కురుమునెల్లి వరలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement