అలుగోలులో 20 టీడీపీ కుటుంబాలు | - | Sakshi
Sakshi News home page

అలుగోలులో 20 టీడీపీ కుటుంబాలు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

నెల్లిమర్ల రూరల్‌: మండలంలోని అలుగోలు ఎంపీటీసీ సెగ్మెంట్‌ పరిధిలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త గదల సన్యాసినాయుడు, మాజీ వైస్‌ ఎంపీపీ సారిక వైకుంఠంనాయుడు సమక్షంలో నక్కెల్ల రామస్వామి, నక్కెల్ల సంతోష్‌, గౌరి, గోపి, మణి, కిల్లాన సూర్యనారాయణ, గూన పండు, అలుగోలు సూర్యనారాయణ, లక్ష్మి తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి బతుకు అగమ్యగోచరంగా మారిందని, నిత్యావసర ధరలు ఆకాంశాన్ని అంటాయన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, ప్రతి ఇంట్లో సంక్షేమ వెలుగులు నిండాయని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి ఎక్కడా లేదని..సంక్షేమాభివృద్ధి పాలన కావాలంటే వైఎస్సార్‌సీపీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, జెడ్పీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి మత్స విజయ, ఎంపీటీసీ అభ్యర్థి ఆల్తి రమణమ్మ, నాయకులు మత్స సత్యనారాయణ, ఆల్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement