ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

● నవంబర్‌ 5న ఉద్యోగులు,

కార్మికులకు పెయిడ్‌ హాలిడే

పార్వతీపురం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నవంబ ర్‌ 5న దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. కార్మిక శాఖ ఉత్తర్వులను యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

ఎన్నికల వేళ మద్యం దుకాణాల మూసివేత

జిల్లాలో మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా పార్వతీపురం, సాలూరు, పాలకొండ పరిధిలో మద్యం దుకా ణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌ నేపథ్యంలో నవంబర్‌ 3 సాయంత్రం 5గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ పరిధిలో మద్యం విక్రయాలు నిషేధమన్నారు. నవంబర్‌ 7న కౌంటింగ్‌ కేంద్రాల చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోను మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా మద్యం అమ్మకాల సమాచారం ఫోన్‌ 8987389271 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement