చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలి

● శాసనమండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

డెంకాడ: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని చింతలవలస గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా పిన్నింటి తమ్మునాయుడు, ఎంపీపీ అభ్యర్థిగా అక్కివరం ఎంపీటీసీ సభ్యురాలు కంది మౌనికను నిర్ణయించామన్నారు. మండలంలో జెడ్పీటీసీతో పాటు 16 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నారని వారందరినీ గెలిపించి వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన నడిచిందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కంది సూర్యనారాయణ, జెడ్పీటీసీ అభ్యర్థి పిన్నింటి తమ్మునాయుడు, ఎంపీపీ అభ్యర్థి కంది మౌనిక, వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement