నేడే పుర పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పుర పోరు

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

నేడే పుర పోరు ● పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీలకు ఎన్నికలు ● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు పట్టణాల వారీ ఇలా.. పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు

● పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీలకు ఎన్నికలు ● ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు

సాక్షి, పార్వతీపురం మన్యం :

స్థానిక సమరం మొదలైంది. మూడు దశల ఎన్నికల ఘట్టాల్లో మొదటి అంకానికి వేళైంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలికలు, పాలకొండ నగర పంచాయతీలో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగానూ మొత్తం 96 వార్డులకు సంబంధించి 155 పోలింగు కేంద్రాలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. 1,302 మంది ఉద్యోగులు విధుల్లో పాల్గొననున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, రూట్‌ అధికారులు, పీవోలు, ఏపీవోలు, సిబ్బంది విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మొత్తంగా మూడు చోట్ల కలిపి 10 మంది చైర్‌పర్సన్‌ అభ్యర్థులు, 228 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచార పర్వంలో దూసు కుపోయాయి. ఆఖరి మెట్టుపై అమీతుమీ తేల్చుకు నేందుకు సిద్ధపడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగు ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశామని కలెక్టరు ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు.

●పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 19,482 పురుషులు, 21,729 మంది మహిళలు, ఇతరులు నలుగురు ఓటర్లుగా ఉన్నారు. 140 బ్యాలెట్‌ బాక్సులతో పాటు 424 మంది పోలింగు సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణ కోసం 13 మంది ఎన్నికల అధికారులు, 24 మంది సహాయ ఎన్నికల అధికారులు, ఐదురుగు జోనల్‌ అధికారులు, తొమ్మిది మంది రూట్‌ అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పార్వతీపురం పట్టణాన్ని ఐదు జోన్లుగా, 14 రూట్లుగా విభజించారు. చైర్మన్‌ అభ్యర్థికి నలుగురు, కౌన్సిలర్‌ సభ్యులకు 122 మంది పోటీ పడుతున్నారు.

●సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 20,039 మంది పురుషులు, 21,893 మంది మహిళలు, ఇతరులుగా ఇద్దరు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 200 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు.. 33 మంది ఎన్నికల అధికారులు, 33 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. మున్సిపాలిటీని ఆరు రూట్లు, ఆరు జోన్లుగా విభజించారు. మొత్తం 450 మంది పోలింగు సిబ్బందిని కేటాయించగా.. వీరిలో 60 మంది పీవోలు, 381 మంది ఇతర సిబ్బంది ఉన్నారు.

●పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 11,453 మంది పురుషులు, 12,012 మంది మహిళలు, ఇతరులు కేటగిరీలో ఒకరు ఓటర్లుగా ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 59 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు.. 30 మంది ఎన్నికల అఽధికారులు, 30 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. ఆరుగురు ఏఈవోలను రిజర్వులో ఉంచారు. నగర పంచాయతీని ఐదు రూట్లు, మూడు జోన్లుగా విభజించారు. మొత్తం 120 మంది పోలింగు సిబ్బందిని కేటాయించగా.. వీరిలో ప్రిసైడింగు అధికారులు, ఇతరు పోలింగు సిబ్బంది ఉన్నారు.

పుర పోరుకు పోలీస్‌ శాఖ పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యాత్మ క, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం సుమారు 600 మంది సిబ్బందిని బందో బస్తుకు వినియోగిస్తున్నారు. ఇందులో ఒక ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఎస్సైలు 30 మంది, ఆర్‌ఎస్‌ఐలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు 106 మంది, కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఇతర విభాగాల సిబ్బంది 442 మంది బందోబస్తు విధుల్లో ఉంటున్నారు. అదనపు ఎస్పీ, డీఎస్పీలు బాధ్యులుగా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement