ప్రశాంత ఎన్నికలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం ● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ ఎన్నికల సమన్వయ అధికారుల నియామకం 3న పైడితల్లి తెప్పోత్సవం

పార్వతీపురం రూరల్‌: ప్రశాంత ఎన్నికలే లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠి న చర్యలు తీసుకుంటా మని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి స్పష్టంచేశారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిప ల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందికి శనివారం దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను పటిష్ట భద్రత నడుమ తరలించాలని స్పష్టం చేశారు. ఓటర్ల ను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపి ణీ చేసినా, బెదిరింపులకు పాల్పడినా సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

పార్వతీపురం: జిల్లాలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ సమాచారాన్ని మీడియాకు ఎప్పటికప్పుడు అందించేందుకు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులను నియమించారు. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ నగర పంచాయతీకి డీఐపీఆర్‌ఓ కేబీఎం సింగ్‌, సాలూరు మున్సిపాల్టీకి డీపీఆర్‌ఓ ఐ.శ్రీనివాసరావు, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.ఎం.షరీఫ్‌, పార్వతీపు రం మున్సిపాల్టీకి ఏఈఐఈ గజపతిరావు, డివిజనల్‌ పీఆర్‌ఓ జీవీ రవికుమార్‌లను కేటాయించారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఉల్లిభద్రలోని డా. వైఎస్సార్‌ ఉద్యాన కళాశాలలో కేబీఎం సింగ్‌ను, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళా శాల వద్ద డీపీఆర్‌ఓ ఐ.శ్రీనివాసరావు, పార్వతీపురం జూనియర్‌ కళాశాలలో ఎం.గజపతిరావును, పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద జీవీ రవికుమార్‌లను సమాచారాన్ని అందించేందుకు నియమించినట్లు శనివారం తెలిపా రు. నవంబర్‌ 1, 3వ తేదీల్లో పట్టణ ఎన్నికల కు, నవంబర్‌ 5న జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌, నవంబర్‌ 7న కౌంటింగ్‌కు సంబంధించి ఈ అధికారులు విధులను నిర్వహిస్తారు. పో లింగ్‌, కౌంటింగ్‌ తాజా సమాచారాన్ని మీడి యా ప్రతినిధులకు అందించడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదించాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కేబీఎం సింగ్‌ తెలిపారు.

విజయనగరం (కల్చరల్‌) క్రైమ్‌: పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఈ నెల 3న జరగనుందని ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. తెప్పోత్సవ ట్రయల్‌ రన్‌ సోమవారం జరుగుతుందన్నారు. తెప్పోత్సవం నిర్వహించే పెద్ద చెరువును అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సిబ్బంది రమేష్‌, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు, వనంగుడి అధికారులు, పూజారు లు కృష్ణ, రాజేష్‌, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement