దేశ ఐక్యతను కాపాడాలి: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

దేశ ఐక్యతను కాపాడాలి: ఎస్పీ

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

దేశ ఐక్యతను కాపాడాలి: ఎస్పీ ● ఎస్పీ కార్యాలయంలో పటేల్‌ జయంతి

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 151వ జయంతిని నిర్వహించారు. ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం దేశ సమైక్యత, అంతర్గత భద్రతకు తొలి హోంమంత్రిగా పటేల్‌ చేసిన సేవలను వివరించారు. 500కు పైగా సంస్థానాల ను భారత యూనియన్‌లో విలీనం చేసి ఐక్య భారతదేశానికి పునాది వేశారని గుర్తుచేశారు. అక్టోబర్‌ 31వ తేదీన పటేల్‌ జయంతి సందర్భంగా దేశవ్యా ప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాల్లేకుండా పౌరులంతా ఐకమత్యంతో దేశ సమగ్రతను కాపాడాలని సూచించారు. ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్‌, రమణ, ఏఆర్‌ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఆర్‌ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement