మున్సిపోల్స్‌కు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

మున్సిపోల్స్‌కు పటిష్ట బందోబస్తు

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

మున్సిపోల్స్‌కు పటిష్ట బందోబస్తు ● 600 మంది పోలీసుల నియామకం

● 600 మంది పోలీసుల నియామకం

పార్వతీపురం రూరల్‌: నవంబర్‌1న ఆదివారం జరగనున్న పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపల్‌ ఎన్నికలకు మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా సుమారు 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి తెలిపారు. భద్రతా పర్యవేక్షణ కోసం సాలూరు, పాలకొండలకు డీఎస్పీలను, పార్వతీపురానికి అదనపు ఎస్పీని ప్రత్యేకంగా నియమించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు రూట్‌ మార్చ్‌ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. నగదు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, పోలింగ్‌ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో డేగకన్ను వేశారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం ముగియడంతో సభలు, ర్యాలీలు, మైకుల వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే ‘112’ టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement