మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి రోజైన శుక్రవారం పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు మార్మోగింది. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యానన్్ గుర్తుకే తమ మద్దతు అనేలా అశేష జనవాహినితో పట్టణం కిక్కిరిసిపోయింది. పట్టణ ప్రారంభంలో గెడ్డ వీధిలో ప్రారంభమైన ఈ ప్రచార ర్యాలీ కిలోమీటరు మేర జనసంద్రంగా మారి పాత బస్టాండ్ వరకు ఉత్సాహంగా సాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వార్డు అభ్యర్థులతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున అడుగులు వేశారు. ప్రచార వాహనంపై నుంచి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి పట్నాన సాయిశ్రీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
–పార్వతీపురం రూరల్


