పంట నష్టపరిహారం చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం చెల్లించండి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

పంట నష్టపరిహారం చెల్లించండి ● రైతు సంఘం నాయకులు డిమాండ్‌ పసుపు పంట నాశనం చేశారని పీఓకు ఫిర్యాదు జర్నలిస్టులపై దాడులు అమానుషం

బలిజిపేట: అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు తహసీల్దార్‌ బాలమురళీకృష్ణకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సువర్ణముఖి నదీ పరీవాహక గ్రామమైన నారాయణపురంలో వాణిజ్య పంటలతో పాటు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50వేలు చొప్పున చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఏపీ రైతు సంఘం మండలాధ్యక్షుడు గోవిందరావు, ఏపీ రైతుకూలీ సంఘం సభ్యుడు సింహాద్రినాయుడు, ఏపీ రైతు సంఘం సభ్యుడు రాజారావు పాల్గొన్నారు.

సీతంపేట: పసుపు పంటను ధ్వంసం చేసిన ఫారెస్టు అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని పీపీ ఈతమానుగూడ పంచాయతీ బిల్లమడ గ్రామానికి చెందిన పాలక నాగేశ్వరరావు ఐటీడీఏ పీఓకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బిల్లమడ గ్రామానికి ఆనుకుని ఉన్న ఫారెస్టు బీట్‌లో ఉన్న భూమిని తరతరాలుగా సాగుచేస్తున్నామన్నారు. ఈ భూమికి పట్టాలు కూడా ఇచ్చారన్నారు. ఐటీడీఏ సరఫరా చేసిన పసుపు విత్తనాలు వేసుకుని పండించుకుంటే ఎటువంటి సమాచారం లేకుండా ఫారెస్టు బీటు అధికారులు ధ్వంసం చేశారని వాపోయారు.

విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి పత్రికా స్వేచ్ఛను పూర్తిగా కాలరాస్తూ, నిరంకుశంగా విలేకరులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని విజయనగరం జిల్లా జర్నలిస్టు యూనియన్‌ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులను టార్గెట్‌ చేసి భౌతిక దాడులకు పురిగొల్పడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో సాక్షి రూరల్‌ విలేకరి సుబ్బారెడ్డిపై కొందరు గుర్తుతెలియని దుండగులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరచడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) సీహెచ్‌ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement