48 గంటల పాటు మద్యం దుకాణాల మూసివేయాలి | - | Sakshi
Sakshi News home page

48 గంటల పాటు మద్యం దుకాణాల మూసివేయాలి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

48 గంటల పాటు మద్యం దుకాణాల మూసివేయాలి ● కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి

● కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలో అక్టోబర్‌ 30 సాయంత్రం 5గంటల నుంచి నవంబర్‌ 1 సాయంత్రం 5గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం విక్రయాలు నిషే ధమని తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వలు, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం సమాచారం ఉంటే ఫోన్‌ 8897389271 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సూచనలు

మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు విధులు కేటా యించిన సిబ్బందికి కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. రెండు ఎన్నికలకు విధులు కేటాయించిన సిబ్బందిలో అక్టోబర్‌ 31న మున్సిపల్‌ ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది మాత్రమే హాజరు కావాలని, జిల్లా పరిష త్‌ ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి నవ ంబర్‌ 3న ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. కేవలం జిల్లా పరిషత్‌ ఎన్నికల శిక్షణకు కేటాయించిన సిబ్బంది మాత్రం అక్టోబర్‌ 31న తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

తుఫాన్‌ సహాయక చర్యలు వేగవంతం చేయాలి

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్‌, తాగునీటి సరఫరా పునరుద్ధరణ, రహదారులపై పడిపోయిన చెట్ల తొలగింపు, చెరువులు, కాలువల గండ్ల పూడ్చివేత, పంట నష్టాల అంచనాను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తుఫాన్‌ పరిస్థితులు, సహాయక చర్యలు, అత్యవసర సమాచారం ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, రైతులకు పంట బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో సహాయక చర్యలు చేపట్టి పట్టణాల్లో 24 గంటల్లో, ప్రభావిత గ్రామాల్లో 72 గంటల్లో సాధ్యమైనంత మేరకు విద్యుత్‌, తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు

జిల్లాలో నవంబర్‌ 1న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం 5గంటలకు ముగిసిందని కలెక్టర్‌ ఎన్నికల అధికారి డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి తెలిపారు. ప్రచార గడువు ముగిసిన తరువాత మైక్‌లు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌ ప్రశాంతంగా, స్వేచ్చగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement