వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నాయకులు

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నాయకులు

బొండపల్లి: గ్రామాల్లో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని బొండపల్లి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని బొత్స అనూష కోరారు. ఈ మేరకు మండలంలోని చిన్నతామరాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరగా శుక్రవారం ఎం.కొత్తవలసలో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడంతో వైఎస్సార్‌సీపీలోకి చాలా మంది వచ్చి చేరుతున్నారని, వారందరికీ వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పించనుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు పిళ్లా భాస్కరరావు, పిళ్లా రామునాయుడు, రెడ్డి సత్తిబాబులతో పాటు పలువురు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బొత్స సాయి గురునాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొద్దల చిన్నం నాయుడు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు ములపర్తి రమణ, పిళ్లా గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.

గుర్ల మండలంలో మరికొందరు..

గుర్ల: మండలంలోని దేవునికణపాకకు చెందిన పలువురు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు. పార్టీలో చేరిన రెడ్డి రామునాయుడు, కోట్ల రామారావు, గుషిడి ఆదినారాయణ తదితరుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సంగంరెడ్డి వెంకటలక్ష్మి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి శుక్రవారం పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆనంతరం గవిడిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు పాల్గొన్నారు.

గరివిడి మండలంలో చేరికలు

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): వైఎస్సార్‌సీపీ హయంలో ఆమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేసిన పాలన పట ఆకర్షితులై ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు బొత్స సందీప్‌, గరివిడి జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స పూజిత పెర్కొన్నారు. ఈ మేరకు గరివిడి మండలంలోని బొండపల్లి మధుర గ్రామమైన సిరిగుడి పేటకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో శుక్రవారం చేరాయి. సిరిగుడి పేటకు చెందిన కొప్పు లోకేష్‌, కొప్పు శ్రీను, కొప్పు అప్పలరాము, కొప్పు యుగంధర్‌తోపాటు మరో 14 కుటుంబాల వారు సందీప్‌, పూజిత సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, యలకల అప్పలనాయుడు, పొన్నాడ కుమార్‌, తమ్మినాయుడు, రాంబాబు, దాలినాయుడు, బాసి సీతన్న రెడ్డి, మీసాల వేణు, గణపతి, గొట్టాపు శ్రీను. రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.

మెరకముడిదాంలో 500 కుటుంబాల చేరిక

మెరకముడిదాం: మండల కేంద్రంలోని ఎస్సీకాలనీకి చెందిన సుమారు 500 కుటుంబాల వారు వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి రేగిడిలక్ష్మణరావు, రేగిడిసీతారాం తదితరుల ఆధ్వర్యంలో బొత్ససందీప్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో శుక్రవారం రాత్రి చేరారు. వారికి బొత్ససందీప్‌ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీకు ఏసమయంలో ఎలాంటి అవసరం వచ్చినా మిమ్మల్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎస్‌.వి.రమణరాజు, మాజీ సర్పంచ్‌లు సరిదిరమేష్‌, పిన్నింటిసుగుణాకరరావు, సత్యనారాయణ, రేగిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలోకి ఆహ్వానించిన బొత్స అనూష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement