ఆటో పోట్లు..! | - | Sakshi
Sakshi News home page

ఆటో పోట్లు..!

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

ఆటో పోట్లు..!

మహిళలకు ఉచిత బస్సులతో పోటు..!

ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేసింది అంటే అది అందరి ప్రజలకు మేలు జరిగేలా ఉండాలి.కూటమి ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఏచిత బస్సు సౌకర్యంతో ఆటోవాలాల ఉపాధికి గండి పడింది.కూటమి సర్కారు హామీలు విస్మరించి ఉచిత బస్సులతో ఆటోవాలాల పొట్టకొట్టిందని వారు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని రామభద్రపురం,బొబ్బిలి టౌన్‌, బొబ్బిలి రూరల్‌, బాడంగి, తెర్లాం మండలాల్లో సుమారు 1500 నుంచి 1600 వరకు ఆటోలు ఉన్నాయి. వాటి ఆధారంగా బతుకుతున్న వారంతా కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం మరింత సమస్యగా మారిందని, ఆటో ప్రయాణాలపై ఆధారపడే మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని పలువురు ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. రోజువారీ ఆదాయం పడిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రామభద్రపురం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆటోడ్రైవర్లకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేవారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రకటించిన ఆటో సేవా పథకం కింద రెండో విడత ఆర్థిక సాయం చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆటోవాలాలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ప్రతి ఏటా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని కూటమి పక్షాలు హామీలు ఇచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించడంతో ఆటో డ్రైవర్లు ధర్నాలు, ఉద్యమాలు చేయడంతో అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత మొదటి విడతలో వివిధ కారణాలు, నిబబంధనల సాకు చూపుతూ కొంత మందికి మాత్రమే సాయం అందించి, మిగిలిన వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే మొదటి విడత ఆర్థిక సాయం ఇచ్చి ఏడాది దాటినా రెండో విడత ఆర్థిక సాయంపై కూటమి సర్కారు ఊసెత్తడం లేదని ప్రభుత్వ తీరుపై ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు మేలు జరిగిందని గుర్తుచేస్తున్నారు.రెండో విడత ఆర్థిక సాయం ఇంకెప్పుడు బాబూ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో జీవనం

రెండో విడత అందని ఆర్థిక సాయం

ఒక విడతలో నిబబంధనల సాకుతో

కొంత మందికే సాయం

ఏడాది దాటినా రెండో విడత సాయంపై ఊసెత్తని ప్రభుత్వం

మహిళలకు ఉచిత బస్సుతో పొట్టకొట్టిన సర్కారు

కూటమి ప్రభుత్వ తీరుపై ఆటో

యజమానుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement