నేను దాదాపు 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్నాను.ఇదే మా జీవనాధారం.దీని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు పథకం వల్ల కొంత మేర ఉపాధి కోల్పోయాం.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత ఒక విడత ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు చొప్పున వేసింది. ఇప్పుడు ఏడాది దాటినా రెండో విడత వేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం మా పొట్టకొట్టింది.
సీహెచ్ లోకేష్, బొబ్బిలి రూట్ యూనియన్ అధ్యక్షుడు, రామభద్రపురం
జగన్ ప్రభుత్వంలోనే
ఆటోవాలాలకు మేలు..
ఎన్నికల ముందు ఆటో కార్మికులకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో సైతం పెట్టారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తర్వాత ఆటో యూనియన్లు ఎన్నో ధర్నాలు,ఉద్యమాలు చేస్తే ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు ఏడాది దాటినా రెండో విడతకు అతీగతి లేదు.జగన్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు మేలు జరిగింది. జగనన్న హామీ మేరకు ప్రతి ఏటా రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. బి.దాలయ్య, ఆటో కార్మికుడు


