గుజరాత్‌ ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌’కు జిల్లా వాసులు | - | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌’కు జిల్లా వాసులు

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

గుజరాత్‌ ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌’కు జిల్లా వాసులు

● ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికై న 50 మంది

● రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్పీ మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌:

గుజరాత్‌ రాష్ట్రంలో అక్టోబర్‌ 30, 31 తేదీలలో ప్రధానమంత్రి హాజరుకానున్న ‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌’ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 50 మంది ఎంపికయ్యారు. ’నక్సల్‌ ముక్త్‌ భారత్‌’ అంశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరేడ్‌ నిర్వహిస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన గిరిజన యువత, విద్యార్థులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం పార్వతీపురం నుంచి గుజరాత్‌కు బయలుదేరిన ఈ బృందం రైలు ప్రయాణాన్ని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పరేడ్‌లో పాల్గొనడం జిల్లా వాసులకు గర్వకారణమని, కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఆహ్వానితులకు రాకపోకల థర్డ్‌ ఏసీ రైలు చార్జీలతో పాటు వసతి, భోజన సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తుందని తెలిపారు. వారి రక్షణ నిమిత్తం ఒక ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారితో కూడిన పోలీస్‌ బృందాన్ని ఎస్కార్ట్‌గా పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేషయ్య, ఎస్‌బీ సీఐలు రమణమూర్తి, రమేష్‌, పట్టణ, రూరల్‌ సీఐలు వెంకట్రావు, రంగనాథం, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement