పెరుమాళిలో 70 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

పెరుమాళిలో 70 కుటుంబాల చేరిక

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

● పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి

తెర్లాం: తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి మంగళవారం భారీగా చేరికలు జరిగాయి. మండల కేంద్రమైన తెర్లాంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో పెరుమాళి మాజీ సర్పంచ్‌ వెలగాడ కృష్ణారావు, టీడీపీ నాయకులు సంచాన జయరావు(జాన్‌), కుప్ప శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 70కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరందరికీ బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ శంబంగి వెంకట చినఅప్పలనాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిన వెలగాడ కృష్ణారావు, సంచాన జాన్‌, కుప్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ పెరుమాళి పంచాయతీ పరిధిలోని పెరుమాళి, టెక్కలివలస గ్రామాలకు చెందిన తామంతా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నామని, అయినప్పటికీ పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, ఇటీవల ఎంపీటీసీ స్థానం ఎస్సీకి రిజర్వేషన్‌ వచ్చినా వైఎస్సార్‌ సీపీకి చెందిన వారిని టీడీపీలో చేర్చుకొని వారికి టిక్కెట్‌ ఇచ్చి తమకు అన్యాయం చేశారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాము టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరామని తెలిపారు. పెరుమాళి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గర్భాపు లూర్ధు విజయానికి కృషి చేస్తామని వారు చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు, సీనియర్‌ నాయకులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, పెనుమత్స అప్పలరాజు, చొక్కరి వెంకటరావు, గరే రాము, గొందాల వెంకటరావు, నర్సుపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement