ప్రశాంతంగా సిరిమానోత్సవం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా సిరిమానోత్సవం

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిరిమానోత్సవాన్ని ఆయన స్వీయ పర్యవేక్షణ చేశారు. సిరిమానోత్సవ భద్రత కోసం సుమారు 3వేల మందిని ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేశారు. ఐజీ గోపీనాథ్‌ జట్టి, ఎస్పీ స్వయంగా సిరిమాను వెంట మూడుసార్లు తిరుగుతూ భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేశారు. ముందస్తు ప్రణాళికతో హుకుంపేట నుంచి సిరిమానును ప్రధాన ఆలయానికి తీసుకురావడం, నిర్ణీత సమయానికి సిరిమాను తిరిగేలా చర్యలు చేపట్టడం వలన ఉత్సవం చీకటిపడక ముందే సజావుగా ముగిసిందన్నారు. అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులతో పాటూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు భద్రత కల్పించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సుమారు 200కి పైగా సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్ధితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్ధాయి అధికారులకు తక్షణ భద్రతా సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement