మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

మంగళవారం శ్రీ 27 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

తుఫాన్‌ ఎఫెక్ట్‌

జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం

అన్ని మండలాల్లో కంట్రోల్‌ రూంల ఏర్పాటు

జిల్లాలోని వివిధ తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలో ప్రజల సౌలభ్యం కోసం కంట్రోల్‌ రూమ్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించడం ద్వారా అవసరమైన సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

అర్నాబ్‌ తుపాను దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో 27, 28, 29వ తేదీల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలతో పాటు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున అన్ని విభాగాల అధికారులను కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నాలుగు రోజులపాటు వేటకు వెళ్లరాదని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పూరి గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలు, ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, పాఠశాలల యాజమాన్యాలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాల వివరాలను వెంటనే అధికారులకు తెలియజేయాలని, అటువంటి భవనాల్లోకి ఎవరినీ అనుమతించకూడదని స్పష్టం చేశారు. రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని.. అధికారుల హెచ్చరికలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్‌ కోరారు.

ఈదురు గాలులపై అప్రమత్తంగా ఉండాలి

పార్వతీపురం: జిల్లాలో అర్నాబ్‌ తుపాను ప్రభావంతో సాలూరు, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, కొమరా డ, తదితర మండలాల్లో గంటకు 76 నుంచి 78 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంద ని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్ట ర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షి త ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ అప్రమత్తంగా ఉండాలని, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికా రి కార్యాలయంలో 24 గంటల కంట్రోల్‌ రూం ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర వేళల్లో జిల్లా కలెక్టరేట్‌ 08963 450347, పార్వతీపురం 79932 40754, పాలకొండ 95027 22212 నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో జేసీ ఆర్‌.వైశాలి తోపాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం..అక్టోబర్‌ 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలకు కాంపెన్సేటరీ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌, యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. సెలవుల కారణంగా కోల్పోయిన ఈ రెండు పనిదినాలను విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్తులో భర్తీ చేయాల్సి ఉంటుందని డీఈఓ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement