హామీలు సరిపోవు..
అమలే ముఖ్యం
పింఛన్లకు కోత..లబ్ధిదారులకు వాత
రెండున్నరేళ్లలో జిల్లాలో పింఛన్ లబ్ధికి వేలాది మంది దూరం
కొత్త పింఛన్ల కోసం 27 వేల
మందికిపైగా దరఖాస్తు
స్థానిక ఎన్నికల వేళ హడావిడి డ్రామా.. ఎన్నికల కోడ్‌తో వెనక్కి
ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య అంతరం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పింఛన్‌దారుల సంఖ్యను తగ్గించడం ఒకవైపు.. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నిరీక్షణలో ఉంచడం మరోవైపు..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. పండుటాకులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు ఆరంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వ హామీలు.. క్షేత్రస్థాయిలో నీటి మీద రాతలుగా మారుతున్నాయి. రెండున్నరేళ్ల కాలంలో జిల్లాలో వేలాది పింఛన్లు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తుండగా..మరోవైపు కొత్త పింఛన్ల కోసం 27 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకుని లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పింఛన్లపై ఆధారపడి జీవించే పేదలు, వృద్ధులు, ఇతర అర్హులు ప్రభుత్వ నిర్ణయాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
పింఛన్ అనేది చాలామంది పేద కుటుంబాలకు నెలవారీ ఆదాయానికి ప్రధాన ఆధారం. వృద్ధాప్యంలో ఆసరాగా, అనారోగ్య సమయంలో మందుల ఖర్చులకు, కుటుంబ అవసరాలకు ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఇంటి ముంగిటకే అవ్వా తాతలకు పింఛన్ మొత్తం అందేది. అప్పట్లో జిల్లాలో 44 వేల మంది వరకూ లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం 1.36 లక్షల మందికి మాత్రమే పింఛన్ లబ్ధి అందుతోంది. వివిధ కారణాలు చూపుతూ వేలాది మందిని లబ్ధికి దూరం చేశారు. నిజంగా అనర్హులను తొలగించే ప్రక్రియ జరిగితే అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉంది. అదే సమయంలో అర్హులైన వారు పింఛ్ కోల్పోయి ఉంటే వారికి తిరిగి న్యాయం చేయాల్సి ఉంటుంది. పింఛన్ల సంఖ్య తగ్గిందనే గణాంకం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.
27 వేల దరఖాస్తులు.. ఎప్పటికి మంజూరో?
స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయంగా లబ్ధి పొందేందుకు, కొత్త పింఛన్ల మంజూరు కోసం చంద్రబాబు ప్రభుత్వం హడావిడిగా గత సెప్టెంబర్‌లో ప్రకటన ఇచ్చింది. అంతే తొందరగా ముగించింది. ఈ క్రమంలో జిల్లాలో 27,945 దరఖాస్తులు వచ్చాయి. వాటి పరిశీలన కూడా పూర్తి చేశారు. స్థానిక ఎన్నికల లబ్ధికోసం ప్రకటనలు ఇచ్చి, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈలోగా ఎన్నికల కోడ్ వచ్చేసింది. పింఛన్ మంజూరుకు బ్రేక్ పడింది. దరఖాస్తుదారుల్లో నిరీక్షణ కొనసాగుతోంది. ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చు ట్టూ తిరుగుతున్న వారు తమకు ఎప్పుడు పింఛన్ మంజూరవుతుందో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందించడమే లక్ష్యమైతే.. దరఖాస్తుల పరిశీలన, అర్హు ల గుర్తింపు, మంజూరు ప్రక్రియకు స్పష్టమైన కాలపరిమితి ఉండాలి. కేవలం దరఖాస్తులు స్వీకరించ డం, ప్రకటనలు చేయడంతో బాధ్యత ముగిసిపో దు. అర్హుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమయ్యే వర కు ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చినట్లు కాదు.
పార్వతీపురం మన్యం వంటి జిల్లాలో పేదలు, వృద్ధులు, ఇతర అర్హులైన వర్గాలకు పింఛన్ కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదు.. నెలవారీ జీవితానికి భరోసా. అలాంటి పథకంలో పాత లబ్ధిదారుల తొలగింపులు, కొత్త దరఖా స్తుల పెండింగ్ రెండూ కలిపి ప్రజల్లో ఆందో ళన కలిగిస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమయంలో ప్రకటనలు, హామీలు రాజకీయ చర్చకు దారితీయవచ్చు. పింఛన్‌దారులకు కావాల్సింది ప్రకటనలు కాదు.. చేతికి అందే ఆర్థిక సాయం. ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత కూడా అర్హుల సమస్యలకు పరిష్కారం లభి స్తుందా? లేక కొత్త పింఛన్ల కోసం మరోసారి ఎదురుచూడాల్సిందేనా? అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


